![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 చూస్తుండగానే మూడో వారానికి వచ్చేసింది. సంజన, డీమాన్ పవన్ ఇద్దరు గత రెండు వారాలలో కెప్టెన్ గా చేశారు. అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ని దివ్య నిఖిత సెలక్ట్ చేసింది. కెప్టెన్సీ కంటెంటెండర్స్ రేసులో.. దివ్య నిఖిత, భరణి, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ అయిదుగురు ఉన్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే కంటెండర్స్ వేసుకున్న టీ షర్ట్ కి మిగతా వాళ్ళు విసురుతున్న బాల్స్ స్టిక్ అవుతాయి.
బజర్ మోగే టైమ్ కి ఎవరి టీ షర్ట్ మీద అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు టాస్క్ నుండి ఎగ్జిట్ అవుతారు. టాస్క్ కి సంఛాలక్ గా పవన్ కళ్యాణ్ ఉంటాడు. మొదటగా టాస్క్ నుండి దివ్య ఎగ్జిట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, తర్వత తనూజ ఎగ్జిట్ అవ్వగా.. చివరికి భరణి, ఇమ్మాన్యుయల్ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ జరుగగా టాస్క్ లో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ మూడో వారం కెప్టెన్ అవుతాడు. ఇక డీమాన్ పవన్ కెప్టెన్సీ బ్యాండ్ ని ఇమ్మాన్యుయల్ కి పెడుతాడు.
కెప్టెన్ అయ్యానంటే అందరి సపోర్ట్ వళ్లేనని ఇమ్మాన్యుయల్ అంటాడు. టాస్క్ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది. ఇమ్మాన్యుయల్ ఫెయిర్ గా కెప్టెన్ అయ్యాడు. బాల్స్ ఎక్కువగా నన్ను టార్గెట్ చేసి విసిరారని భరణి ఫీల్ అవుతాడు. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ కి ఎక్కువ బాల్స్ విసర్లేదు. హౌస్ లో అందరికి పాజిటివ్ గా ఉన్న పర్సన్ ఇమ్మాన్యుయల్ అందుకే కంటెస్టెంట్స్ భరణిని టార్గెట్ చేశారు.
![]() |
![]() |